డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొడదాం.. నషా ముక్త సమాజాన్ని నిర్మిద్దాం

28-09-2026 | 08:35pm

నషా ముక్తి అవగాహన కార్యక్రమంలో వైద్యాధికారి సురేష్‌కుమార్..

కోనరావుపేట సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ‘నషా ముక్తి యువ ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, స్టూడెంట్ కౌన్సిలర్ బి. భూమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కోనరావుపేట పీహెచ్‌సీ వైద్యాధికారి (ఎంహెచ్‌ఓ) జె. సురేష్‌కుమార్(PHC Medical Officer J. Sureshkumar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

డ్రగ్స్‌కు బానిసైతే ఆరోగ్యం, భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని, విద్యార్థులు తమ జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలని కోరారు.బి భూమేష్ మాట్లాడుతూ డ్రగ్స్ అనే మహమ్మారిని సమాజం నుంచి తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై సరైన అవగాహన కలిగి ఉండాలని, వాటికి దూరంగా ఉంటూ శారీరక, మానసిక అభివృద్ధికి బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సరిత, పీహెచ్‌సీ సూపరింటెండెంట్ రక్షణ్, అధ్యాపకులు సుధాకర్, శ్రీనివాస్, అశోక్‌కుమార్, భారత్, నాన్‌టీచింగ్ సిబ్బంది కర్ణాకర్‌తో పాటు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు