విద్యాసంస్థల్లో సీట్లను తెలంగాణకే పరిమితం చేయాలి
24-06-2024 01:12 AM
టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థ ల్లోని సీట్లను కేవలం తెలంగాణకే పరిమితం చేయాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఆదివారం ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. విభజన చట్టానికి ఈ నెల 2 తో కాలం చెల్లిందని స్పష్టం చేశారు. విభజన చట్టంలోని పలు విద్యాసంస్థలతో తెలుగు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి విశ్వవిద్యాలయాలను ఉమ్మడి జాబితా నుంచి తొలగించాల్సి ఉందన్నారు. అలాగే హైదరాబాద్ పరిధిలోని విద్యాసంస్థల్లోని సీట్లనూ తెలంగాణకు చెందిన వారికే ఇవ్వాలన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం వెంటనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ‘ఎక్స్’లో సీఎంవో, సీఎస్‌కు ట్యాగ్ చేశారు.






