20 May, 2026 | 5:55 PM

జిల్లా బంద్ విజయవంతం

20-05-2026 04:53 PM

నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ మెడికల్అండ్ డ్రగ్స్ అసోసియేట్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బంద్ విజయవంతమైన టు సంఘం నాయకులు బద్రి శ్రీనివాస్ నేరెళ్ల ప్రమోద్ తెలిపారు. జీవనోపాధి కోసం తాము మెడికల్ వ్యాపారాలు ఎంచుకున్నామని బడా మెడికల్ ఏజెన్సీలు కార్పొరేట్ సంస్థలు కమిషన్లకు ఆన్లైన్ మార్కెట్ చేస్తున్నాయని ఆరోపించారు. వెంటనే వాటిని ఆపాలని డిమాండ్ చేశారు. నిర్మల్ భైంసాఖానాపూర్ ముధోల్ అన్ని ప్రాంతాల్లో మెడికల్ షాపులను మూసివేసి నిరసన తెలపడం జరిగిందని వివరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు పేర్కొన్నారు.