21 May, 2026 | 3:17 AM

మెడికల్ షాపుల బంద్ సక్సెస్

21-05-2026 01:48 AM

మంగపేట, మే 20 ( విజయక్రాంతి ) : ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ ( ఏఐఓసీడీ ) ఇచ్చిన దేశవ్యాప్త మెడికల్ షాపులు బంద్ పిలుపులో భాగంగా బుధవారం ములుగు జిల్లా మంగపేట మండలంలో మెడికల్ షాపుల బంద్ విజయవంతం అయింది. మెడికల్ షాపులు బంద్ లో భాగంగా మండలంలోని మెడికల్ షాపుల యజమానులు కమలాపురం నుండి రాజుపేట వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

కోవిడ్ సమయంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని, ఆన్లైన్ లో మందుల అమ్మకాలకు ఫుల్స్టాప్ పెట్టాలని, కార్పొరేట్ కంపెనీల భారీ డిస్కౌంట్లను ఆపాలని, కల్తీ ఔషధాలను నియం త్రించాలని నినాదాలిచ్చుకుంటూ ర్యాలీ ని ర్వహించారు. ఈ కార్యక్రమంలో మంగపేట మండల మెడికల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షులు బర్ల సంజీవరెడ్డి , ప్రధాన కార్యదర్శి సామల సాంబశివరావు, కోశాధికారి వాలాద్రి శ్రీనివాసరెడ్డి, మెడికల్ షాప్స్ నిర్వాహకులు పాల్గొన్నారు.