పెరిగిన పెట్రోల్,డీజిల్‌పై కాంగ్రెస్ భారీ నిరసన
రాహుల్ గాంధీ హెచ్చరించినట్లే ధరల పెంపు: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్, మే 20 (విజయ క్రాంతి): రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్, కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఆకుల నరసయ్యతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఎడ్ల బండ్ల పై ఎక్కి నిరసన తెలపగా, పార్టీ శ్రేణులు రిక్షా పై ద్విచక్ర వాహనాలను ఎక్కించి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ సామాన్యుల నడ్డి విరిచేలా పనిచేస్తోందన్నారు. ఇటీవల జరిగిన బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు శాసనసభ ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు పెరుగుతాయని తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముందే హెచ్చరించారన్నారు. ఆయన చెప్పినట్లుగానే ఎన్నికలు ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమాంతం పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ పేద ప్రజల ఉసురు పోసుకోకుండా పెంచిన పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కట్టకమృత్యుంజ యం, నాయకులు మల్లికార్జున రాజేందర్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, ఉప్పుల అంజనీ ప్రసాద్,చాంద్ పాషా, ఎండి తాజ్, పులి ఆంజనేయులు గౌడ్ , ముత్యం శంకర్ గౌడ్, నునావత్ భాస్కర్ నాయక్, పర్వత మల్లేశం, చాడ గొండ బుచ్చిరెడ్డి, మడుపు మోహన్, గడ్డం విలాస్ రెడ్డి, పత్తి మధు, కామ్రెడ్డి రాంరెడ్డి, బానోతు శ్రావణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి,పొన్నం శ్రీనివాస్ గౌడ్, పడాల అజయ్ గౌడ్, గుమ్మడి రాజకుమార్, వరాల నర్సింగం, తదితరులు పాల్గొన్నారు.






