23-10-2025 12:00:00 AM
ఊపిరితిత్తులు దెబ్బతిన్న 40 ఏళ్ల వ్యక్తికి ‘ఎక్మో’ చికిత్స
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 22 (విజయక్రాంతి): తీవ్రమైన న్యుమోనియాతో పోరాడుతూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్న 40 ఏళ్ల వ్యక్తి, మెడికవర్ హాస్పిటల్స్‌లోని నిపుణుల బృందం అందించిన చికిత్స కారణంగా అద్భుతంగా కోలుకున్నారు. వేరే ఆసుపత్రిలో వెంటిలేటర్ సపోర్ట్ ఉన్నప్పటికీ, అతని ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదకరంగా పడిపోయాయి, ఊపిరితిత్తులు పూర్తి గా పనిచేయడం ఆగిపోయాయి.
పరిస్థితి విషమించడంతో, ఆయన్ను వెంటనే మెడికవర్ హాస్పిటల్స్‌కు తరలించారు. ఇక్కడ, డాక్టర్ ఘన శ్యామ్ (క్రిటికల్ కేర్ విభాగాధిపతి), డా. కృష్ణ ప్రసాద్ (సీటీవీఎస్ సర్జన్), డా. ఎ. రఘుకాంత్ (ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్), డా. చైతన్య (పల్మనాలజిస్ట్)లతో కూ డిన ప్రత్యేక బృందం తక్షణమే బాధ్యతలు స్వీకరించింది. పరిస్థితి తీవ్రతను గ్రహించిన వైద్యులు, అతనికి ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజ నేషన్ (ఎక్మో)ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
డా. ఎ. రఘు కాంత్ మాట్లాడుతూ, “రోగి ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. అతని ఊపిరితి త్తులు దాదాపుగా పనిచేయడం లేదు. ఎక్మో సపోర్ట్ మాత్రమే అతన్ని కాపా డే ఏకైక మార్గం. ఇలాంటి కేసులలో ప్రతి సెకను విలువైనది. సాంకేతికత మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న బృందం యొక్క కృషి, ఖచ్చితత్వం, పట్టుదలే ప్రాణాలను కాపాడుతాయి” అని తెలిపారు.
నిరంతర పర్యవే క్షణలో, ఇన్ఫెక్షన్‌కు కారణమైన బ్యాక్టీరియా ను గుర్తించడానికి బ్రాంకోస్కోపీ నిర్వహించి, దానికి తగిన ప్రత్యేక యాంటీబయాటిక్స్ ఇవ్వబడ్డాయి. కొన్ని రోజుల్లోనే ఆశలు చిగురించాయి. రోగి ఊపిరితిత్తులు క్రమంగా కోలుకోవడం ప్రారంభించాయి, దీంతో ఎక్మో సపోర్ట్‌ను, ఆ తర్వాత వెంటిలేటర్‌ను కూడా తొలగించి, అతను సొంతంగా శ్వాస తీసుకోగలిగాడు. డా. ఘన్‌శ్యామ్ మాట్లాడుతూ, “ఇది మా ఐసీయూ, ఎక్మో, పల్మ నాలజీ బృందాల సమన్వయ కృషి. రోగి కోలుకోవడం మాకు గర్వకారణం” అన్నారు.