‘మెడికవర్’ అరుదైన ఘనత
శస్త్రచికిత్స లేకుండానే పోంటైన్ క్యావెర్నోమాకు చికిత్స
హైదరాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): మెదడులోని అత్యంత సున్నితమైన, కీలకమైన భాగంలో ఏర్పడిన అరుదైన, ప్రమాదకరమైన రక్తనాళాల గడ్డ పోంటైన్ క్యావెర్నోమా కేసును, ఎటువంటి ఓపెన్ సర్జరీ లేకుండానే, ఆధునిక స్టీరియోటాక్టిక్ రేడియోసర్జరీ (ఎస్‌ఆర్‌ఎస్) సాంకేతికతతో మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూ ట్ వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు. నల్లగొండకు చెందిన 57 ఏళ్ల అంబటి రాము లు కొంతకాలంగా వస్తువులు రెండేసిగా కనిపించడం (డబుల్ విజన్), కంటి కదలికలు మందగించడం వంటి లక్షణాలతో బాధపడు తూ మెడికవర్ ఆసుపత్రిని ఆశ్రయించారు.
వైద్యులు నిర్వహించిన ఎంఆర్‌ఐ స్కాన్‌లో మెదడులోని ‘పాన్స్’అనే అత్యంత కీలక భాగం లో రక్తనాళాల అసాధారణ నిర్మాణం వల్ల ఏర్పడిన క్యావెర్నోమా గడ్డతో పాటు రక్తస్రా వం (హెమరేజ్) ఉన్నట్లు గుర్తించారు. డా. కండ్ర ప్రశాంత్, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నేతృ త్వంలో రోగికి స్టీరియోటాక్టిక్ రేడియోసర్జరీ చికిత్స ఖచ్చితత్వంతో రేడియేషన్ కిరణాలను నేరుగా గడ్డ ఉన్న ప్రాంతానికే పంపి, చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యకరమైన మెదడు కణజాలా న్ని కాపాడుతూ చికిత్స చేస్తారు. చికిత్స పూర్తున రోజునే రోగిని ఆరోగ్య స్థిరత్వంతో ఇంటికి పంపించారు. చికిత్స అనంతరం రాములు కోలుకుని,సాధారణ జీవితం గడుపుతున్నారు.




