15 March, 2026 | 6:00 PM

Breaking News

మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి పాజిటివ్   •  

బకాయిలు తక్షణమే చెల్లించాలి

15-01-2026 12:00 AM

రూ.3,900 కోట్లు ఇంకా పెండింగ్‌లోనే..

విడుదల చేయకుంటే ప్రభుత్వ విశ్వసనీయతకు దెబ్బ

ఆల్కోబెవ్ పరిశ్రమ హెచ్చరిక

హైదరాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): రూ.3,900 కోట్ల పెండింగ్ బకాయిలు తక్షణ మే చెల్లించాలని బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి, ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్డబ్ల్యుఏఐ) సీఈఓ సంజిత్ పాధి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ (సీఐ ఏబీసీ) డైరెక్టర్ జనరల్ అనంత్ అయ్యర్ డిమాండ్ చేశారు. ఈ నెల చివరలో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) 56వ వార్షిక సమావేశం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆల్కహాలిక్ బేవరేజెస్ (ఆల్కోబెవ్) రంగానికి సంబంధించిన దీర్ఘకాలిక బకాయిలు చెల్లించాలని కోరారు. చెల్లింపుల ఆలస్యం అయితే సరఫరా వ్యవస్థలు దెబ్బతినడమే కాకుండా ఎక్సైజ్ ఆదాయాలపై ప్రభావం చూపుతాయన్నారు. పెట్టుబడిదారుల విశ్వాసా న్ని కూడా దెబ్బ తీస్తుందని హెచ్చరించారు.

తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఆల్కోబెవ్ సరఫరాదారులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.3,900 కోట్లు దాటాయన్నారు. వీటిలో సుమారు రూ.900 కోట్లు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్నాయ ని పేర్కొన్నారు. గత దశాబ్దంలో రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం నాలుగు రెట్లు పెరిగిందన్నారు. 2014లో సుమారు రూ.9,000 కోట్ల నుంచి 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.38,000 కోట్లకు చేరుకుందన్నారు. అక్టోబర్ 2025లో మాత్రమే మద్యం రిటైల్ లైసె న్స్ దరఖాస్తు ఫీజుల ద్వారా రాష్ట్రానికి రూ. 3,000 కోట్లకు పైగా ఆదాయం లభించిందన్నారు. డిసెంబర్ 2025లో కూడా ఆదాయ టర్నోవర్ చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నట్లు వెల్లడైందన్నారు. రాష్ట్రానికి ఆల్కోబెవ్ రంగం పన్ను ఆదాయాల్లో మూడో వంతుకు పైగా వాటా అందిస్తోందన్నారు. దేశంలోని రాష్ట్రాల్లో ఇదే అత్యధికమన్నారు.

ఈ రంగం ప్రతి నెలా సుమారు రూ. 2,300 నుంచి రూ. 2,600 కోట్ల వరకు ఆదాయాన్ని సృష్టిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను కల్పిస్తోందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామి క పెట్టుబడులు తగ్గుము ఖం పట్టాయన్నారు. టీజీ-ఐపాస్ ఆమోదాలు 50 శాతానికి పైగా తగ్గాయన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.28,100 కోట్లుగా ఉన్న పెట్టుబడులు 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.13,730 కోట్లకు పడిపోయాయని పేర్కొన్నారు. దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనా మిక్ ఫోరం సమావేశంలో తెలంగాణ తనను తాను ఒక ప్రాధాన్య పెట్టుబడి గమ్యంగా ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇప్ప టికే ఉన్న బాధ్యతలను ప్రభుత్వం గౌరవించ డం అత్యంత కీలకమన్నారు. ఈ స్థాయిలో చెల్లింపుల ఆలస్యం జరిగితే పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రాష్ట్ర విశ్వసనీయత, ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు.