10 June, 2026 | 1:13 AM

నైపుణ్యాల పెంపునకు ‘మెడికవర్’ కృషి

10-06-2026 12:11 AM

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, డాక్టిన్ అకాడమీతో ఎంవోయూ

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): ఆరోగ్య సంరక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, డాక్టిన్ అకాడమీ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది.

ఆరోగ్య విద్య, క్లినికల్ నైపుణ్యాల అభివృద్ధి, వృత్తిపరమైన శిక్షణ మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ఆరోగ్య సేవల అందింపును మరింత బలోపేతం చేయడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశం. ఈ ఒప్పందం ద్వారా ప్రాక్టీసింగ్ నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు, టెక్నీషియన్లు వైద్య సిబ్బందికి ప్రత్యేక అకడమిక్ కార్యక్రమాలు, నైపుణ్యా భివృద్ధి శిక్షణలు, సర్టిఫికేషన్ కోర్సు లు, అబ్జర్వర్షిప్లు, వర్క్‌షాప్‌లు, నిరంతర వృత్తిపరమైన విద్యా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ భాగస్వామ్యం ద్వారా లైసెన్స్ పొందిన నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణుల వృత్తిపరమైన ఎదుగుదల, క్లినికల్ సామర్థ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ రీజినల్ మెడికల్ హెడ్ డా. శ్రీవాస్తవ, సూపరింటెండెంట్ డా. కిషోర్, డాక్టి న్ అకాడమీ ప్రతినిధి శ్రీ హర్ష్, రీజినల్ హెడ్  ఎమర్జెన్సీ మెడిసిన్ డా. నయ న్,సెంటర్ హెడ్ డా. స్వరూప్ పాల్గొన్నారు..