9 June, 2026 | 1:40 AM

దిగొచ్చిన పసిడి ధరలు

09-06-2026 01:00 AM
  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.1,55,450
  2. కిలో వెండి ధర 2,45,700

న్యూఢిల్లీ, జూన్ 8: గ్లోబల్ మార్కెట్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న మందగమనం వల్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. ద్రవ్యోల్బణ భయాల వల్ల వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనివల్ల సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై ఇన్వెస్టర్లకు ఆసక్తి తగ్గింది. దీంతో సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు క్షీణించాయి.

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం వల్ల ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. శాంతి చర్చల ఆశలు సన్నగిల్లడం కూడా ఇందుకు కారణం. ఈ గ్లోబల్ సంక్షోభం ద్రవ్యోల్బణంపై చూపే ప్రభావంపై వ్యాపారులు నిఘా ఉంచారు. హైద రాబాద్‌లో పది గ్రాముల ౨౪ క్యారెట్ల బంగారం 1,5౫,౪౫౦ వద్ద ట్రేడ్ అయింది. కిలో వెండి ధర 2,45,౭౦0 పలికింది.