నిరుద్యోగ యువకులరా జాగ్రత్త
10-06-2026 12:12 AM
అడ్డదారులు వద్దు.. కష్టపడి ఆర్టీసీ కొలువులు సాధించండి!
టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): ఆర్టీసీ ఉద్యోగాల పేరిట కేటుగాళ్ల చేతిలో చిక్కి మోసపోవద్దని, టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగ నియమకాలన్నీ పూర్తి పారదర్శకంగా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతాయని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు.
‘ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసే మధ్యవర్తులను, దళారులను అస్సలు నమ్మకండి. అడ్డదారులు తొక్కి జీవితాలను పాడుచేసుకోవద్దు. కష్టపడి చదివి, మీ ప్రతిభతోనే ఆర్టీసీ కొలువులు సాధించండి. కొలువుల పేరుతో అమాయక నిరుద్యోగులను మో సం చేసే వారిపై క్రిమినల్ చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు.






