3 April, 2026 | 1:57 AM

‘మీ సేవ’కు అంతరాయం

03-04-2026 12:00 AM

3 నుంచి 5 వరకు సేవల నిలుపుదల: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

సూర్యాపేట, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో ’మీ సేవ’ ఆన్లైన్ సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 3 సాయంత్రం 5గంటల నుంచి 5వ తారీకు ఉదయం 8 గంటల వరకు నిర్వహణ పనులు, సర్వర్ పనితీరు మెరుగుదల, భద్రతా వ్యవస్థల అప్ గ్రేడ్, సాంకేతిక సమస్యల నివారణ కోసం ఈ నిర్వహణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ సమయంలో సంబంధిత విభాగాలకు చెందిన ఆన్లైన్ సేవలు, డిజిటల్ లావాదేవీలు, వెబ్ పోర్టల్ సేవలు తాత్కాలికంగా పనిచేయవని, ప్రజలు అత్యవసర సేవలను ముందుగానే వినియోగించుకోవాలన్నారు. భవిష్యత్తులో వేగవంత మైన, అంతరాయం లేని సేవలను అందించేందుకు ఈ నిర్వహణ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.