10న ఉద్యోగుల హక్కుల సాధన సభ
- లక్ష మందితో హైదరాబాద్‌లో నిర్వహిస్తాం
- ఉద్యోగుల జేఏసీ
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఉద్యోగ(Employment), ఉపాధ్యాయుల(Teachers)కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై ఈ నెల 10న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ(Telangana Employees JAC) తెలిపింది. ఈ కార్యక్రమానికి ‘ఉద్యోగుల హక్కుల సాధన సభ(Employees Rights Action Council,)’గా జేఏ సీ నామకరణం చేసిందని, లక్ష మంది ఉద్యోగులతో హైదరాబాద్‌లో కదం తొక్కుతామ ని జేఏసీ వెల్లడించింది.
కుటుంబసభ్యులు, పిల్లలతో ఈ సభకు హాజరై ప్రభుత్వానికి తమ నిరసనను తెలపాలని సూచించారు. బుధవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో చలో హైదరాబాద్ సన్నాహక సమావే శాన్ని నిర్వహించి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉద్యోగులంతా సామూహిక సెలవులు పెట్టి సభకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులను కలెక్టర్లు ఇబ్బంది పెట్టవద్దని జేఏసీ నేతలు కోరారు.
ఉద్యోగులతో చర్చించేందుకు, తమ సమస్యలకు పరిష్కార మా ర్గాలు చూపించేందుకు మంత్రి లేకపోవడం విచారకరమని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుందని మూడేండ్లు వేచిచూశామని, అయినా పరిష్కారం కాలే దని జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్ పాల్గొన్నారు.






