calender_icon.png 8 May, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలోని నియోజకవర్గల సమస్యలపై బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

08-05-2025 04:50:40 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల సమస్యల పరిష్కారంపై గురువారం భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం పాల్వంచలో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రమూకలపై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పట్ల హర్షం వ్యక్తం చేసిన బీజేపీ భద్రాద్రి ముఖ్య నాయకులు, పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలను దాడి చేసిన మన ఆర్మీకి, కేంద్ర ప్రభుత్వంకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా మాజీ కన్వీనర్ నాళ్ల సోమసుందర్, ముస్కు శ్రీనివాస రెడ్డి, (మహబూబాబాద్ పార్లమెంట్ కన్వీనర్), పోడియం బాలరాజు (పినపాక కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి), తాటిపాముల ఐలయ్య (జిల్లా ప్రధాన కార్యదర్శి) గొట్టెపొల్ల శ్రీనివాస్ (అశ్వారావు పేట నియోజకవర్గ కన్వీనర్), బుడగం రవి (ఖమ్మం పార్లమెంట్ కో కన్వీనర్), యెడ్లపల్లి శ్రీనివాస కుమార్ (మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి), భూక్యా సీతారాం నాయక్ (మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి), పొనిశెట్టి వెంకటేశ్వర్లు (బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి), రమేష్ బాబు (దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు), దున్నపోతుల రాజు (జిల్లా కౌన్సిల్ మెంబెర్), దాసరి రమేష్, మాదారపు లక్ష్మణ్, వీరన్న, గుండు రాజు, సురేందర్, నాగరాజులు పాల్గొన్నారు.