08-05-2025 04:44:55 PM
విద్యార్థి నాయకుడిగా రాజకీయ రంగ ప్రవేశం..
జాతీయ భావాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు..
చిట్యాల (విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన బుర్ర వెంకటేష్ గౌడ్ బిజెపి మండల అధ్యక్షుడిగా రెండవసారి నియమితులయ్యాడు. జాతీయ సమైక్యతే లక్ష్యంగా.. హిందూ భావజాల వ్యాప్తికై బుర్ర వెంకటేష్ గౌడ్ విద్యార్థి దశలోనే జాతీయ భావాలను అలవర్చుకొని.. దేశ సమైక్యతే లక్ష్యంగా పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చేరి.. అనేకమంది విద్యార్థులను.. ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్ది.. విద్యారంగ సమస్యలపై అనేకమైన పోరాటాలు చేశాడు. ఈ క్రమంలో విద్యార్థి పరిషత్ నాయకత్వం ఆయనకు వివిధ హోదాల్లో పని చేయడానికి అవకాశం కల్పించింది. ఏబీవీపీలో చిట్యాల మండల కన్వీనర్ గా, భూపాలపల్లి బాగ్ ప్రముఖ్ గా పనిచేసిన ఆయన అనంతరం భారతీయ జనతా యువమోర్చాలో ఉమ్మడి వరంగల్ జిల్లా క్రియాశీలకంగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా ఆయన యువమోర్చా జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఆయన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీ పటిష్టతకు విశేష కృషి చేస్తూ.. ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ.. ప్రభుత్వంపై పోరాటం చేస్తూ పార్టీ ఎదుగుదలకు విశేష కృషి చేస్తున్న క్రమంలో ఆయనను బిజెపి చిట్యాల మండల ప్రధాన కార్యదర్శిగా, అనంతరం బిజెపి మండల అధ్యక్షుడిగా నియమించింది. కాగా రెండవసారి కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల సంస్థగత ఎన్నికల బుర్ర వెంకటేష్ గౌడ్ ను రెండవసారి భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి, నాగపురి రాజమౌళి గౌడ్ జిల్లా అధ్యక్షుడు ఏడునూతల నిశిధర్ రెడ్డి వెన్నంపల్లి పాపయ్యా, కన్నం యుగదిశ్వర్, దొంగల రాజేందర్, జిల్లా మండల నాయకులకు వెంకటేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనపై నమ్మకంతో ఈ బృహత్తరమైన బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టాన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీ బలోపితానికి నిరంతరం కృషి చేస్తానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాలలో కాషాయ జెండాను ఎగురవేసేందుకు కృషి చేస్తానన్నారు. గతంలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.