30 నుంచి ఏరోమార్ట్ హైదరాబాద్ 2026
జూలై 2 వరకు హెచ్‌ఐసీసీలో అంతర్జాతీయ సదస్సు
విమానయానం, రక్షణ రంగాల్లో దిగ్గజ కంపెనీల సమావేశం
ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 ముఖ్యాంశాలు
- తేదీలు: జూన్ 30 – జూలై 2, 2026
- వేదిక: హెచ్‌ఐసీసీ, హైదరాబాద్
- పాల్గొనే దేశాలు: 25
- కంపెనీలు: 400+
- ప్రతినిధులు: 1,200+
- ప్రధాన రంగాలు: విమానయానం, రక్షణ తయారీ, డిజిటల్ టెక్నాలజీ
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): విమానయానం, రక్షణ రంగాల్లో దిగ్గజ కంపెనీలు ఒక చోట సమావేశమవుతున్నాయి. ఈ నెల30 నుంచి జూలై 2 వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్ హెచ్‌ఐసీసీ లో ‘ఏరోమార్ట్ హైదరాబాద్ 2026’ పేరుతో అంతర్జాతీయ సదస్సు జరగనుంది.
ప్రపంచ విమానయాన దిగ్గజాలు హైదరాబాద్‌కు వస్తున్నాయి... తెలంగాణ మరోసారి గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా నిలవబోతోందా?విదేశీ కంపెనీలు, వాటికి విడిభాగాలు సరఫరా చేసే భారతీయ సంస్థలు ఇక్కడ కలుసుకుని, కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటాయి. ప్రపంచంలో విమానయాన తయారీ రంగం లో వేగంగా ఎదుగుతున్న దేశాల్లో భారత్ ఒ కటిగా మారింది. ఈ సదస్సుకు 25 దేశాల నుంచి 400కు పైగా కంపెనీలు, 1,200 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారు. విమానాలు, విమాన విడి భాగాలు తయా రు చేసే పెద్ద కంపెనీలకు, వాటికి సామగ్రి సరఫరా చేసే చిన్న-మధ్య తరహా కంపెనీలకు మధ్య సమావేశాలు జరుగుతాయి.
తెలంగాణ వార్తలపై మరిన్ని అప్‌డేట్స్ కోసం విజయక్రాంతి న్యూస్‌ను ఫాలో అవ్వండి.
ఈ సదస్సు వల్ల భారతీయ చిన్న-మధ్య తరహా కంపెనీలకు మంచి అవకాశం వస్తుంది. వాళ్లు నేరుగా విదేశీ కంపెనీల కొనుగోలు అధికారులతో సంప్రదింపులు జరిపి, తమ సామర్థ్యాన్ని ప్రదర్శించి, వారి సరఫరా వ్యవస్థలో భా గం కావచ్చు. విదేశీ కంపెనీలకు కూడా ఇది మంచి అవకాశం ఎందుకంటే భారత్లో నాణ్యమైన సరఫరాదారులను వెతుక్కోవడానికి ఇదొక సులభమైన మార్గం. భేటీలతో పాటు, విమానయాన తయారీ భవిష్యత్తు, సరఫరా వ్యవస్థలు, కొనుగోలు పద్ధతులు, డిజిటల్ టెక్నాలజీల గురించి చర్చా గోష్టులు కూడా ఈ సదస్సులో జరుగుతాయి.
ఈ సదస్సును అడ్వానస్డ్ బిజినెస్ ఈవెంట్స్ (ఏబీఈ), బీసీఐ ఏరోస్పేస్ సంస్థలు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రైజింగ్, టీజీఐఐసీ సహకారంతో నిర్వహిస్తున్నాయి.ఈ సదస్సు ద్వారా కొత్త పెట్టుబడులు రావడంతో పాటు, భారతీయ కంపెనీలకు ప్రపంచ స్థాయి వ్యాపార అవకాశాలు మరింత పెరుగుతాయి. తెలంగాణ పేరు ప్రపంచ విమానయాన రంగంలో మరింత వినిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్ భారత్‘ పేరుతో దేశీయంగా ఉత్పత్తిరంగాన్ని విస్తృత ప ర్చేందు కు చర్యలు తీసుకుంటోంది. రక్షణ సా మాగ్రిని కూడా ఎక్కువగా దేశంలోనే త యారు చేయడం, విమానయాన రంగం విస్తరించ డం, ఎగుమతులు పెరగడం వంటి కారణాలతో విదేశీ కంపెనీలు తమ ఉత్పత్తి కోసం భారతీయ సంస్థలవైపు చూస్తున్నాయి.
తెలంగాణలో పెరుగుతున్న పారిశ్రామిక పెట్టుబడులపై తాజా అప్‌డేట్స్ కోసం మా బిజినెస్ & ఇండస్ట్రీ వార్తలు విభాగాన్ని అనుసరించండి.
ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 ఎప్పుడు జరుగుతోంది?
ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 జూన్ 30 నుంచి జూలై 2 వరకు మూడు రోజులపాటు హెచ్‌ఐసీసీలో జరుగుతుంది.
ఈ సదస్సులో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి?
25 దేశాల నుంచి 400కు పైగా కంపెనీలు, 1,200 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు.
భారతీయ ఎంఎస్‌ఎంఈలకు ఈ సదస్సు వల్ల ఏం ప్రయోజనం?
విదేశీ కంపెనీలతో నేరుగా వ్యాపార చర్చలు జరిపి, ప్రపంచ సరఫరా వ్యవస్థలో భాగమయ్యే అవకాశం లభిస్తుంది.
తెలంగాణకు ఈ కార్యక్రమం ఎలా ఉపయోగపడుతుంది?
కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, అంతర్జాతీయ గుర్తింపు, ఏరోస్పేస్ పరిశ్రమల విస్తరణకు ఇది దోహదపడుతుంది.
నగర మౌలిక సదుపాయాల విస్తరణకు సంబంధించిన "మెట్రో-2కు రైట్ రైట్" ప్రత్యేక కథనం కూడా పరిశ్రమల అభివృద్ధికి కీలకంగా మారనుంది.
FAQ's
Q1: ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 ఎక్కడ జరుగుతోంది?
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతోంది.
Q2: ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు?
అడ్వాన్స్డ్ బిజినెస్ ఈవెంట్స్ (ABE), BCI Aerospace సంస్థలు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్నాయి.
Q3: ఎన్ని కంపెనీలు పాల్గొంటున్నాయి?
400కు పైగా అంతర్జాతీయ, భారతీయ కంపెనీలు పాల్గొంటున్నాయి.
Q4: ఈ సదస్సు ప్రధాన లక్ష్యం ఏమిటి?
విమానయాన, రక్షణ రంగాల్లో వ్యాపార భాగస్వామ్యాలు, పెట్టుబడులు, సరఫరా గొలుసు విస్తరణను ప్రోత్సహించడం.
Q5: తెలంగాణకు ఈ కార్యక్రమం వల్ల ప్రయోజనం ఏమిటి?
ప్రపంచ ఏరోస్పేస్ మ్యాప్‌లో తెలంగాణ స్థానం మరింత బలపడటంతో పాటు కొత్త పెట్టుబడులు ఆకర్షించబడతాయి.
హైదరాబాద్‌లో భారీ పెట్టుబడుల అవకాశాలపై మరిన్ని వివరాల కోసం "గ్రేటర్ వాసులకు గుడ్ న్యూస్: లక్ష అఫోర్డబుల్ ఇళ్ల నిర్మాణం" కథనాన్ని చదవండి.






