17 April, 2026 | 9:38 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

రక్తదానం... ప్రాణదానంతో సమానం

21-06-2025 10:36 PM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు...

ఖమ్మం (విజయక్రాంతి): రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానం అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు(BJP District President Nellore Koteswara Rao) అన్నారు. బీజేపీ 1వ పట్టణ ప్రధాన కార్యదర్శి పాలేపు రాము పుట్టినరోజు సందర్భంగా శనివారం తల సేమియా పిల్లల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బిజెపి నాయకులు రక్తదానం చేశారు. నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ... రాము జన్మదిననం సందర్భంగా  రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవరావు, డా. గోంగూర వెంకటేశ్వర్లు,  డా. శీలం పాపారావు, బీజేపీ పట్టణ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.