calender_icon.png 23 May, 2025 | 3:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మెగా రక్తదాన శిబిరం

12-04-2025 12:28:19 AM

హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): ఈ నెలలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, మహా త్మా జ్యోతిరావు ఫూలే జయంతుల సందర్భంగా మారం జగదీశ్వర్, డాక్టర్.ఎస్.ఎం. హుస్సేని (ముజీబ్) ఆధ్వర్యంలో తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం, హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించా రు. ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రారంభించారు.

నాంపల్లిలోని గృహకల్ప కాంప్లెక్స్, టీఎన్జీఓస్ యూనియన్‌లో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు రక్దదానం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడు తూ.. డాక్టర్ అంబేద్కర్ జీవితం అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, న్యాయమైన సమాజ స్థాపనకు అంకితం చేయబడిందన్నారు.

సమాజం శ్రేయస్సుకు దోహదం చేయడం కోసం రక్తదాన శిబిరం వినయపూర్వకమైన ప్రయత్నం అని జనబ్ ఎండి.ఫహీముద్దీన్ ఖురేషి, ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడు, టీఆర్‌ఎంఐఇఎస్, ఎమ్మెల్సీ కోదండరామ్ పేర్కొ న్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంఎన్జె, ఓజిహెచ్, కింగ్ కోఠి, ఐపిఎం, తలసేమియా సిక్లే సెల్ సొసైటీ రక్త నిల్వ కేంద్రాలతో కలిసి నిర్వహించారు.

మెగా రక్తదాన శిబిరానికి గెజిటెడ్ అధ్యక్షుడు ఎల్లూరి శ్రీనివాస్, సెంట్రల్ యూనియన్ అసోసియేట్ ప్రెసిడెంట్స్ ఎం. సత్యనారాయణ గౌడ్, కస్తూరి వెంకటేశ్వర్, సభ్యులు కొండల్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, ఉమారెడ్డి, మురళిరాజ్, బోలిగిద్ద శంకర్, టీజీవో సిటీ అధ్యక్షుడు ఎం.బి.కృష్ణ యాదవ్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు అశోక్, రంగారెడ్డి అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి విజయ్, నిజామాబాద్ అధ్యక్షుడు సుమన్, మహబూబ్‌నగర్ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, కార్యదర్శి చంద్ర నాయక్, కరీంనగర్ అధ్యక్షుడు లక్ష్మణ్, నాగర్‌కర్నూల్ అధ్యక్షుడు వెంకటేశ్వర్, గోల్కొండ సతీష్, జిల్లా అధ్యక్షుడు ఎస్.విక్రమ్ కుమా ర్, కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, సభ్యులు కె.ఆర్.రాజ్ కుమార్, జె.బాల్రాజ్, ఉమర్ ఖాన్, ఖలీద్ అహ్మద్, వైదిక శాస్త్ర, ముకీమ్ ఖురేషి, సుజాత, గీతా సింగ్, శ్రీధర్ నాయు డు, జహంగీర్ పాషా, ఎండి.వహీద్, సిటీ సభ్యులు కె.శ్రీకాంత్, హరికృష్ణ, మెడికల్ ఫోరం సభ్యులు కిరణ్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ముజీబ్ సతీమణి సీమా ముజీబ్, సయ్యద్ అసదుద్దీన్, సయ్యద్ జమాల్ జహంగీర్, ఎస్‌ఆర్‌ఓ అంజాద్ అలీ, స్నేహితులు బషీర్ భాయ్, ఉస్మాన్ అలీ ఉస్మానీ, రామకృష్ణ రెడ్డి, రోహిత్, పలువురు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.