1 July, 2026 | 8:13 PM

Breaking News

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •  

రక్తదానం మరొకరికి ప్రాణదానం

28-06-2025 12:26 AM

విటల్ హాస్పిటల్ లో మెగా రక్తదాన శిబిరం

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): రక్తదానం చేయడం వలన ప్రాణాపాయం లో ఉన్నవారికి ప్రాణదానం చేసినట్లు అవుతుందని విట్టల్ హాస్పిటల్ ఎండి డాక్టర్ విట్టల్ బాబు అన్నారు .హాస్పిటల్ పదవ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక హాస్పటల్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాన శిబిరానికి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తాన్ని డొనేట్ చేశారు .ఈ సందర్భంగా డాక్టర్ విటల్ బాబు మాట్లాడుతూ సరిపోను రక్తం నిలువలు లేక ఎంతో మంది ప్రమాదాలకు గురైన వారు చనిపోతున్నారని అన్నారు. ముఖ్యంగా యువకులు ముందుకు వచ్చి విరివిగా రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలి అన్నారు. రక్తాన్ని కృత్తిమంగా తయారు చేసే అవకాశం లేనందున రక్తదానమే పరిష్కారం అన్నారు.

ఈ రక్తదాన శిబిరంలో   20 మంది పైచిలుకు రక్తదాతలుగా ఆవిర్భవించినారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఏ సి హెచ్ పుల్లారావు మాట్లాడుతూ విట్టల్ హాస్పిటల్ 9 వసంతాలు పూర్తిచేసుకుని విజయవంతంగా పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టడం అభినందనీయం అన్నారు. హాస్పిటల్ ప్రజల విశ్వాసం పొందిందని అన్నారు. రక్తం నిలువల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని హాస్పిటల్ యజమాన్యం రక్తదాన శిబిరం నిర్వహించడం వలన ఎంతోమందికి ప్రాణాలు పోసినట్లు అవుతుందన్నారు. 

అలాగే ఈ సంవత్సరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ తరపున నాలుగవ(4వ) రక్తదాన శిబిరం గా విటల్ హాస్పిటల్ నందు ఉండటం చాలా హర్షినీయమని అన్నారు. యువత ఇంకా ముందుకొచ్చి తమ స్నేహితులతో  శ్రేయోభిలాషులతో సమాజ బాధ్యతను తమ భుజాలపై తీసుకొని రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం శ్రీవాణి ,డాక్టర్ సుధాకర్ ,డాక్టర్ దామర యాదయ్య, డాక్టర్ విజయకుమార్ ,డాక్టర్ సంధ్యారాణి , డాక్టర్ పద్మ, ఈసం శ్రీకాంత్ ,కెమిస్ట్ డ్రగ్స్ అసోసియేషన్ టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, హోల్సేల్ డీలర్ పవన్, మెడికల్ రిప్రజెంటేటివ్స్, ఆసుపత్రి సిబ్బంది, పాల్గొన్నారు.