24 August, 2026 | 11:36 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

నిరుపేదలకు ఉన్నత వర్గాల విద్య అందించడమే లక్ష్యం

28-06-2025 12:26 AM
  1. హుజుర్‌నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందు నిలిపేందుకు కృషి

జూనియర్, డిగ్రీ కళాశాల టాపర్లకి గోల్ మెడల్

రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  

సూర్యాపేట, జూన్ 27 (విజయక్రాంతి) : నిరుపేదలకు ఉన్నత వర్గాల విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం హుజుర్ నగర్ లో రూ.7.25 కోట్లతో  నిర్మాణ చేయనున్న నూతన జూనియర్ కాలేజీ, రూ.4.65 కోట్లతో నిర్మాణం చేయనున్న డిగ్రీ కాలేజీ  భవనాలకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో విద్య కంటే గొప్ప విషయం మరొకటి లేదని తదనగుణంగానే నియోజకవర్గంలోని కళాశాలలకు, పాఠశాలలకు ఎల్లవేళలా నా సహకారం అందజేస్తామన్నారు. డిగ్రీ, జూనియర్ కాలేజీలకు ఆరు లక్షల రూపాయలతో కంప్యూటర్లు, ప్రింటర్లు అందించడం జరిగినదని, అలాగే మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, కాలేజీ లకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు.

భవనాలకు మరమ్మతులు జరిపిస్తానని, జంబో ఫ్యాన్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు మంజూరు చేస్తానన్నారు. అదేవిధంగా మంచినీటి సదుపాయ కల్పనకు కొత్త ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయిస్తానన్నారు. నేను కళాశాలలో చదువుకోలేదని, అలాంటి కళాశాల జీవితం అనుభవించాలనే కోరిక ఉండేదని 16 సంవత్సరాలకే మిలటరీలో చేరి మిలిటరీ స్కూల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి తరువాత యుద్ధ విమాల పైలెట్ శిక్షణ తీసుకొని చైనా, పాకిస్తాన్ బోర్డర్ లో పనిచేసీ మిగ్ 21, 23 యుద్ధ విమానాలు నడిపానన్నారు. జూనియర్, డిగ్రీ కళాశాలలో టాపర్ విద్యార్థులకు నా వ్యక్తిగత నిధుల నుండి  గోల్ మెడల్ అందిస్తానన్నారు.

కావున విద్యార్థులు కష్టపడి చదివి హుజూర్ నగర్ నియోజకవర్గన్ని విద్యలో ముందు ఉంచాలన్నారు. రాష్ట్రంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు రాబోవు కాలంలో మరిన్ని అందిస్తానన్నారు.  పేదలకు సన్న బియ్యం పంపిణీ  రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాధిక అరుణ్ కుమార్,  మాజీ మున్సిపల్ చైర్మన్  శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ గూడెపు  శ్రీనివాస్, ఇ డబ్ల్యూ ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి. శైలజ, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ డిప్యూటీ ఇంజనీర్ రమేష్, జూనియర్ కాలేజ్ ఇంచార్జ్ ప్రిన్సిపల్ జి. శ్రీనివాస్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రామారావు, మైనారిటీ రిజిస్ట్రేషన్ కాలేజీ ప్రిన్సిపాల్ రెహన బేగం  అధికారులు  పాల్గొన్నారు.