సబ్ జైల్‌లో మెగా హెల్త్ క్యాంప్
మహబూబాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహబూబాబాద్ సబ్ జైల్లో గురువారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. జైలర్ మల్లెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా హెల్త్ క్యాంప్ లో ప్రభుత్వ వైద్యాధికారుల బృందం పాల్గొని, జైల్లోని ఖైదీలకు అత్యాధునిక వైద్య పరికరాల ద్వారా పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జైలర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వైద్యాధికారుల సహకారంతో విచారణ ఖైదీలకు మొబైల్ ఎక్స్ రే మెషీన్లతో పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జైలర్ పట్టేం బిక్షపతి, వడ్డేబోయిన శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్లు ఏ.అర్జున్, అనిత, ప్రియాంక, కళ్యాణి, మౌనిక, అన్నపూర్ణ, శివరాం, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.




