14 May, 2026 | 5:39 PM

ఈనెల 16న జాబ్ మేళా

14-05-2026 04:26 PM

నిర్మల్ మే 14 (విజయక్రాంతి): నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 16న మెగా జాబ్ మేళా ఈనెల 16వ తేదీన (శనివారం) ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మల్ నందు "మెగా జాబ్ డ్రైవ్-2026" నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం. సుధాకర్  తెలిపారు. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో నిర్వహించే ఈ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, మరియు పీజీ పూర్తి చేసిన అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.  ఉదయం 10:00 గంటలకు తమ విద్యా అర్హత పత్రాలతో కళాశాల ప్రాంగణానికి హాజరు కావాలని సూచించారు.

కెరీర్ గైడెన్స్ కో-ఆర్డినేటర్ కట్టా రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగాలు పొందేలా చేయడమే ఈ మేళా ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అభ్యర్థులు ఇంటర్వ్యూలకు వచ్చే సమయంలో తమ వెంట కనీసం రెండు సెట్ల రెజ్యూమెలు (Resume), ఆధార్ కార్డు జిరాక్స్ మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు  తీసుకుని రావాలని కోరారు ఇతర  వివరాల కోసం ఈ క్రింది నంబర్లలో సంప్రదించగలరు: 9701809374, 9494559027, 9553141962.