నేడు హుస్నాబాద్‌లో మెగా జాబ్‌మేళా
24-06-2024 01:17 AM
సిద్దిపేట, జూన్ 23 (విజయక్రాంతి): మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశాల మేరకు యువజన సర్వీసుల శాఖ ద్వారా నిర్వహిస్తున్న మెగా జాబ్‌మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి కోరారు. నేటి ఉదయం 10 గంటలకు హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్ అండ్ ఫంక్షన్ హాల్‌లో మెగా జాబ్‌మేళా ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ జాబ్‌మేళాలో 60కి పైగా కంపెనీలు 5 వేలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. కనీసం 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల 7వ తరగతి నుంచి పీజీ వరకు పట్టభద్రులైన ఎవరైనా హాజరుకావచ్చన్నారు. వివరాలకు 96423 33667, 6300610339 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలన్నారు.






