1 July, 2026 | 10:22 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్

31-05-2025 12:15 AM

పాల్గొన్న టీజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సదాశివపేట,మే 30 : రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం సదాశివపేటలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

ఎంతో మంది నిరుపేదలు వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారు ఉచిత మెగా క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ క్యాంపులో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్, డయాబెటిస్, బీపీ, జనరల్ హెల్త్ కి సంబంధించి మొత్తం 320 కి పైగా రోగులకు వైద్యం అందించారు. 320 సభ్యులలో  52 మందికి క్యాన్సర్ కోసం స్కానింగ్ చేశారు. 

110 మందికి కార్డియాలజిస్ట్ టెస్టు, 158 మందికి జనరల్ వైద్యాన్ని అందించారు. అందరికీ ఉచితంగా మందులు  అందించారు. ఈ మెగా హెల్త్ క్యాంప్ లో పాల్గొన్న వారందరికీ ఓదెల ఈశ్వరయ్య ఫౌండేషన్ వారి తరఫున భోజనం అందించారు.

కార్యక్రమంలో రోటరీ క్లబ్ లేక్ డిస్టిక్ మొయినాబాద్ అధ్యక్షులు ఓదెల రాజశేఖర్, డాక్టర్ వెంకట రంగారెడ్డితో పాటు ఆయా విభాగాలకు చెందిన డాక్టర్లు,  సదాశివపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్  ఓదెల ప్రభు గుప్తా, సెక్రెటరీ అశోక్ కుమార్ బస్సా, కోశాధికారి వేణు, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.