2 September, 2026 | 11:26 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

ఘనంగా మెగా ఎంఎస్‌ఎంఈ క్రెడిట్ అవుట్‌రీచ్

17-05-2026 | 12:00am

సెంట్రల్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ 

హైదరాబాద్, మే 16(విజయక్రాంతి): ఎంఎస్‌ఎంఈల అభివృద్ధి, యువ పారిశ్రామికవే త్తలకు ప్రోత్సాహం, వ్యాపార విస్తరణకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో సెంట్రల్ బ్యాం క్ ఆఫ్ ఇండియా హైదరాబాద్‌లో మెగా ఎంఎస్‌ఎంఈ క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమా న్ని ఘనంగా నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్ ఎంవీ మురళీ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, మహిళా పారిశ్రామికవేత్తలు, స్వ యం ఉపాధి యువతకు వేగవంతమైన, సులభమైన రుణ సదుపాయాలు అందించేందుకు బ్యాంక్ కట్టుబడి ఉందని తెలిపారు.అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గౌరవ అతిథిగా పాల్గొని యువ పారిశ్రామికవేత్తలకు ప్రేరణాత్మక సందేశం అందించారు.

విజయ సాధనలో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం కీలకమని పేర్కొన్నారు. కార్యక్ర మంలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, స్టార్టప్ ప్రతినిధులు కాలాటరల్ ఫ్రీ రుణాలు, జీఎస్టీ ఆధారిత ఫైనాన్స్, ముద్ర రుణాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యే క పథకాలు, హాస్పిటాలిటీ రంగానికి అందుబాటులో ఉన్న రుణ సదుపాయాలపై బ్యాంకు ఉన్నతాధికారులతో నేరుగా చర్చించారు.

వ్యా పార టర్నోవర్ ఆధారంగా జీఎస్టీ లింక్డ్ ఫైనాన్సింగ్ సదుపాయాలు కల్పిస్తున్నామని, అర్హు లకు రూ.10 లక్షల వరకు ముద్ర రుణాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో వస్తి వెంకటేష్, సీజీఎం, ఎం పిచ్చయ్య, జీఎం అండ్ జోనల్ హెడ్, హైదరాబాద్, గజేంద్రచౌహాన్, డీజీఎం అండ్ రీజినల్ హెడ్, హైదరాబాద్, దేవేంద్ర, డీజీఎం, సీఎఫ్‌బ్బీ ఏవీ రమణమూర్తి, డీజీఎం అండ్ డిప్యూటీ జోనల్ హెడ్, సీఎస్‌ఎస్ రావు, జాయింట్ డైరెక్టర్, ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్, బాలానగర్, ఎ ప్రభాక ర్, కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.