ఇది అందుకే చెబుతున్నా

01-05-2024 12:15:00 AM

ప్రముఖ కథానాయిక మెహారిన్ ఫిర్జాదా తాను ఎగ్‌ఫ్రిజింగ్ చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.“ గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రాసెస్‌లో వున్నాను. అయితే ఈ సున్నితమైన విషయాన్ని బయటకు చెప్పాలా? వద్దా అనే సందేహంలో వున్నాను. అయితే కొంత మంది మహిళల కోసం ఈ విషయం చెప్పాలని నిర్ణయించుకున్నా అన్నారు. ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఆరోగ్యకరమైన అండాలను భద్రపరుచుకుని కావాలనుకున్నప్పుడు పిల్లల్ని కనే వెసులుబాటు వుండటం. మెహరీన్ ముందుగానే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుని జాగ్రత్తపడుతుంది. ‘భవిష్యత్తులో సంక్లిష్టతలను నివారించడానికి అందరు మహిళలు ఈ పద్ధ్దతిని అనుసరించాలని నేను భావిస్తున్నాను. తల్లి కావాలనే నా కల కొన్ని సంవత్సరాలు ఆలస్యమైనా ఈ రకంగా తీర్చుకోవాలనుకుంటున్నాను. నా ఈ నిర్ణయానికి నా మిత్రులు, బంధువుల సపోర్ట్ వుంది’అని చెప్పుకొచ్చారు మెహారిన్