బాలికకు సహాయం
07-05-2026 12:32 AM
భిక్కనూర్, మే 6 (విజయక్రాంతి): మెదక్ జిల్లాలో తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న ఓ బాలికకు భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామ ప్రజాసేవ కమిటీ సభ్యులు సహాయం అందించారు. సర్పంచ్ గొల్ల అరుణ స్వామి యాదవ్, ఉపసర్పంచ్ ఆస రమేష్ ఆధ్వర్యంలో వెంటనే స్పందించి ఆ బాలికకు ఆహారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మట్టే రజనీకాంత్ రెడ్డి, పోలుమహేందర్, పెంజర్ల శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు తెలిపారు.






