28 July, 2026 | 1:49 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

03-06-2026 04:15 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ వ్యాఖ్యాతలు ఎల్లంకి వైకుంఠం, ఈ. రామ్మోహన్ రావులు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వాసవి మాత దేవాలయంలో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానము ధర్మ ప్రచార పరిషత్ వారు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా శ్రీ రామాయణ విశిష్టత, రామాయణ పారాయణప్రాధాన్యత, రామాయణము లోని పాత్రల ప్రభావం మన జీవితాలపై, మన కుటుంబ వ్యవస్థపై ఏ విధంగా ప్రభావం ఉంటుందనే విషయాలపై వ్యాఖ్యాతలు  వివరించారు. వాసవి మాత దేవాలయం అర్చకులు వల్ల కొండ మఠం మహేష్ తీర్థ ప్రసాదాలు అందజేశారు.