యోగాతో మానసిక ప్రశాంతత
సనత్‌నగర్‌లో యోగా ప్రాధాన్యంపై ఎమ్మెల్యే తలసాని పిలుపు
సనత్నగర్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): యోగాతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం సనత్నగర్లోని సెవెన్ టెంపుల్స్ ఆవర ణలో భారతీయ యోగా సంస్థాన్ 60వ స్థాపన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన యోగా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యోగాకు వయస్సుతో సం బంధం లేకుండా ప్రతిరోజు కొంత సమ యం కేటాయించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. యోగా ప్రయోజనాలపై మరిం త అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులవుతు న్న నేటి యువత మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోతున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. దేశ విదేశాల్లో భారతీ య సం స్కృతిని ఎంతో గౌరవంగా పాటిస్తున్నారని, పండుగలను ఘనంగా జరుపుకుం టున్నా రని పేర్కొన్నారు. మరిన్ని యోగా కేంద్రాలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా మహమ్మారి అనంతరం ప్రజల్లో ఆరోగ్య పరిరక్షణపై చైతన్యం పెరిగిందని తెలిపారు.
యోగా కేంద్రాల ఏర్పాటుకు, యోగా సాధకులకు అవసరమైన సహకారం అందించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా నని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సనత్నగర్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నిర్వాహకులు సుధీర్ కులకర్ణి, ఏఎస్ చారి, రేఖ, రవీందర్, శేషగిరిరావు, అలాగే నాయకులు సురేష్ గౌడ్, రాజేష్ ముదిరాజ్, బాలరాజ్, గోపిలాల్ చౌహన్, గులాబ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.




