అవగతం చేసుకుంటూ అభ్యాసన చేయండి
13-04-2026 12:12 AM
డాక్టర్ చంద్రశేఖర్
గండీడ్, ఏఫ్రిల్ 12: విద్యార్థులు ప్రతి వి షయాన్ని అవగతం చేసుకుంటూ అభ్యసన చేయాలని డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మం డల పరిధిలోని వెన్నచేడు మోడల్ జూనియర్ కాలేజ్ ఒకేషనల్ కోర్స్ 16 మంది విద్యార్థులకు మండల కేంద్రంలోని పి హెచ్ సి, ప్రైమరీ హెల్త్ సెంటర్లో ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సందర్బంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వెన్నాచెడు మోడల్ జూనియర్ కాలేజీలో స్లున్,బిపి,షుగర్,సిపిఆర్, వంటి ఆరోగ్య విషయాలలో అవగాహన కల్పిస్తూ సూచనలు ఇచ్చి వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగిందిని తెలిపారు. ఈ కార్యక్రమంలో వె న్నచెడు మాడల్ జూనియర్ కాలేజ్ ఒకేషన ల్ హెల్త్ కేర్ పి.ఈశ్వరమ్మ, పిహెచ్ సి ఫార్మసిస్ట్ దుర్గా మల్లేశ్వరి, వైద్య సిబ్బంది యాద మ్మ,మమత, బాలమణి, ఒకేషనల్ విద్యార్థులు పాల్గొన్నారు.




