12 May, 2026 | 9:41 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

చెరువుల రక్షణ చర్యలు చెప్పండి

24-04-2024 01:34 AM

ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, ఏప్రిల్‌2౩ (విజయక్రాంతి): హైదరాబాద్లోని చాంద్రాయణగుట్టలోని జల్పల్లి, మరో చెరువులో చెత్తతో పూడ్చివేత చర్యలకు పాల్పడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. చెరువులను కాపాడటానికి తీసుకునే చర్యలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివా దులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ, నీటిపారుదల శాఖ ముఖ్యకార్య దర్శులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ, జల్పల్లి మున్సిపల్ కమిషనర్, మెట్రో రైల్ ఎండీ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీచేసింది.

విచారణను వాయిదా వేసింది. మెట్రో ప్రాజెక్టు రాకతో పట్టణ ప్రాంతాల్లో భూముల ధరలు పెరగడంతో ఆక్రమణదారుల కన్ను చెరువులపై పడిందంటూ ఓ పత్రికలో వచ్చిన కథ నాన్ని హైకోర్టు సుమొటోగా తీసుకొని ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి మంగళవారం విచారణ చేపట్టింది. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాసిన లేఖను పిల్‌గా తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.