ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమాలు
భక్తులను ఆకట్టుకున్న అయ్యప్ప భజనలు
అంగరంగ వైభవంగా మెట్ల పూజలు
పెద్ద ఎత్తున తరలివచ్చిన అయ్యప్ప స్వాములు
మహా పడిపూజలో గురు స్వాములు
కామారెడ్డి (విజయక్రాంతి): స్వామియే శరణం అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వాముల చరణ్ ఘోషతో మారు మోగుతున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఎల్లారెడ్డి బాన్సువాడ జుక్కల్ బిచ్కుంద పిట్లం వంటి పట్టణ కేంద్రాలే కాకుండా మండల కేంద్రాల్లో గ్రామాల్లో ఎక్కడ చూసిన కార్తీకమాసం వచ్చిందంటే అయ్యప్ప స్వాములు సందడి నెలకొంటుంది. అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములు 41 రోజులు కఠిన దీక్ష చేసి మహా అయ్యప్ప పడిపూజ నిర్వహిస్తున్నారు. కామారెడ్డి అయ్యప్ప సేవా సమితి ఎల్లారెడ్డి అయ్యప్ప సేవా సమితి బిచ్కుంద బాన్సువాడ బీర్కూరు అయ్యప్ప సేవ సంస్థల ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి అయ్యప్ప శరణు ఘోషతో మహా పడిపూజ కార్యక్రమాలను ఘనంగా అయ్యప్ప స్వాములు నిర్వహించారు.
గురుస్వాముల వారి ఆధ్వర్యంలో కన్నుల పండగ అయ్యప్ప మహా కుడి పూజను కొనసాగిస్తున్నారు. గణపతి సుబ్రహ్మణ్యస్వామి అయ్యప్ప స్వామి విగ్రహాలకు అభిషేకాలు అర్చనలు పులాభిషేకం నిర్వహించారు. అనంతరం 18 మెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక్కొక్క మెతుకు ఒక్కొక్క పాట పాడుతూ హారతి పత్రంతో వెలిగించారు. అయ్యప్ప స్వాములు పెట్టే జిల్లా ఆడుతుండగా మెట్ల పూజను గురు స్వాములు నిర్వహించారు. కామారెడ్డి అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతిరోజు స్వాములకు ఉచిత అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిత్యం 500 నుంచి 1000 మంది భక్తులు పాల్గొంటున్నారు. అయ్యప్ప స్వాములతో పాటు వారి కుటుంబ సభ్యులు అయ్యప్ప శరణు ఘోషతో స్వామివారిని స్తుతిస్తున్నారు.






