calender_icon.png 11 January, 2026 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకున్న ‘మేరూ అంతరాగ్ని 2026’

10-01-2026 01:34:37 AM

మేరూ ఇంటర్నేషనల్ స్కూల్ తెల్లాపూర్ క్యాంపస్‌లో నిర్వహణ

హైదరాబాద్, జనవరి 9: మేరూ ఇంటర్నేషనల్ స్కూల్ తెల్లాపూర్ క్యాంపస్‌లో శు క్రవారం ‘మేరూ అంతరాగ్ని 2026’ రెండవ సంచికను ఘనంగా నిర్వహించింది. సస్టెయినబిలిటీ (స్థిర అభివృద్ధి) అంశాన్ని ప్రధానంగా తీసుకున్న ఈ కళా ప్రదర్శనలో విద్యార్థుల సృజనాత్మకత పర్యావరణ అవగాహ నకు, బాధ్యతాయుత జీవనానికి శక్తివంతమై న మాధ్యమంగా నిలిచింది. పూర్తిగా విద్యార్థులే నిర్వహించిన ఈ ప్రదర్శన, ప్రకృతి, మనుషుల మధ్య ఉన్న అనుబంధంపై అర్థవంతమైన చర్చకు దారితీసింది.

ఉద్దేశ్యపూ రిత విద్యపై మేరూ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు మిస్ మేఘనా గోరుకంటి జుపల్లి విద్యలో బాధ్యతాయుత సృజనాత్మకత పాత్రను వివరించారు. ఈ ప్రదర్శనలో సహజ, పునర్వినియోగ, అప్‌సైకిల్ చేసిన పదార్థాలతో రూపొందించిన అనేక ఆకట్టుకునే కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారతీయ జానపద కళల నుంచి ప్రేరణ పొందిన ‘హార్మనీ ఆఫ్ ట్రెడిషన్స్’ కళాఖండం సాంస్కృతిక వారసత్వం, సస్టెయినబిలిటీ మధ్య ఉన్న అను బంధాన్ని ప్రతీకాత్మకంగా చూపించింది.

పర్యావరణ సమస్యలను ప్రతిబింబించే ‘ఓషన్స్ ఇన్ డిస్ట్రెస్’ కళాఖండం సముద్ర కాలుష్యాన్ని హైలైట్ చేయగా, వాడిన ప్లాస్టిక్ స్ట్రాలుతో రూపొందించిన ‘ఫేసెస్ ఆఫ్ టుమారో’ మానవ బాధ్యతపై ఆలోచింపజేసింది. వర్లీ శైలిలో రూపొందించిన ‘సర్కిల్ ఆఫ్ లైఫ్’ కళాఖండం సామూహిక జీవనం మరియు పర్యావరణ సమతుల్యతను ప్రతిబింబిస్తూ, సస్టెయినబిలిటీ ఒక సమిష్టి బాధ్యత అనే సందేశాన్ని ఇచ్చింది. కేంబ్రిడ్జ్, సీబీఎస్‌ఈ పాఠ్యప్రణాళికలతో సమగ్ర విద్యను అందిస్తున్న మేరూ ఇంటర్నేషనల్ స్కూల్, సృజ నాత్మకత, నాయకత్వం, నైతిక విలువలను పెంపొందించే విద్యకు కట్టుబడి ఉందన్నారు.