calender_icon.png 11 January, 2026 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు

10-01-2026 01:33:35 AM

ఆత్మకూరి రామారావు భారతీయ విద్యాభవన్‌లో ఉత్సాహంగా నిర్వహణ

హైదరాబాద్, జనవరి 9: జూబ్లీహిల్స్‌లోని ఆత్మకూరి రామారావు భారతీయ విద్యాభవన్ ప్రాంగణంలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ రేవతి ముఖ్య అతిథిగా హాజరుకాగా, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలతా నాయర్ విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది.

విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో, మరి కొంతమంది హరిదాసుల వేషధారణలో గంగిరెద్దుతో ప్రదర్శన ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఎంతో ఉత్సాహంగా సాగింది. విద్యార్థులు ఏర్పాటు చేసిన ఆహార స్టాళ్లతో పాఠశాల ప్రాంగణమంతా కళకళలాడింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం గాలిపటాల పోటీలు, రంగోలి పోటీలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సకినాలు, రవ్వ లడ్డూలు వంటి ప్రత్యేక సంప్రదాయ వంటకాలు ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం ఆనందోత్సాహాలతో విజయవంతంగా ముగిసింది.