14 July, 2026 | 11:45 PM

మరో రెండ్రోజులు వానలే వాతావరణ శాఖ

09-06-2024 02:08 AM

హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 8 (విజయక్రాంతి): రుతుపవనాలు తెలంగాణలో మరింత విస్తరించాయి. రాష్ట్రంలో రానున్ను రెండు రోజుల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని వివరించింది. రానున్న మూడు రోజుల్లో ఇవి అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని తెలిపింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల్, యాదాద్రి, మేడ్చల్, హైరాబాద్ జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. శనివారం వనపర్తి జిల్లాలో ఆత్మకూరులో 82.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది.