‘శ్రీరాంసాగర్’కు పూడిక శాపం
- ప్రాజెక్ట్ నిర్మించినప్పుడు నిల్వసామర్థ్యం 112 టీఎంసీలు
- ప్రస్తుత నీటి నిల్వసామర్థ్యం 80.5 టీఎంసీలు
నిజామాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఉత్తర తెలంగాణ ప్రజలు వరప్రసాదంగా భావిస్తారు. ప్రాజెక్ట్ ద్వారా 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టులో పూడిక పెరుగుతూ నిల్వసామర్థ్యం తగ్గుతూ వస్తుంది. ప్రాజెక్ట్ పరిధిలో నీటి నిల్వ సామర్థ్యం 112 టీఎంసీలు కాగా ప్రస్తుతం 80.5 టీఎంసీలకు పడిపోయింది. ఈ చొప్పున 50 ఏళ్లలో నీటి నిల్వ సామర్థ్యం 31.5 టీఎంసీలు తగ్గ డం గమనార్హం. ప్రాజెక్ట్ పరిధిలో మూడు ప్రధాన కాలువలు, కాకతీయ, సరస్వతి, లక్ష్మికాల్వలు ఉన్నాయి.
కాకతీయ కాల్వ ద్వారా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌తో పాటు నల్లగొండ జిల్లాలో పలు ప్రాం తాల్లోని భూములు సస్యశ్యామలమయ్యా యి. సరస్వతి కాల్వ ద్వారా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో 35 వేల ఎకరాలు, లక్ష్మికాల్వ ద్వారా నిజామాబాద్ జిల్లాలో 25 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఇవే కాకుం డా ప్రాజెక్ట్‌పై ఆధారపడి అనేక లిప్ట్ ఇరిగేషన్ స్కీంలు ఆధారపడి ఉన్నాయి. మరోవైపు వరదలు వచ్చినప్పుడు వృథా వెళ్లే జలాలను వినియోగించుకునేందుకు ఇరిగేషన్ అధికారులు వరద కాలువను నిర్మిం చారు. కాల్వను కరీంనగర్ సమీపంలోని మానేరు డ్యాంకు అనుసంధానించారు. 18 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే మహాసంకల్పంతో 1963లో నాటి ప్రభుత్వం శ్రీరాంసాగర్ ప్రా జెక్ట్ నిర్మించింది. కానీ ప్రస్తుతం కేవలం తొ మ్మిది లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రం జలాల స్థిరీకరణ జరిగింది.
తెరుచుకోని సిల్ట్ గేట్లు..
ప్రాజెక్టు నిర్మించేటప్పుడు ప్రాజెక్టులో పూడిక చేరుతుందని ఊహించిన అప్పటి ఇంజనీర్లు ప్రాజెక్టులోని సిల్ట్‌ను తొలిగించేందుకు వరదలు వచ్చినప్పుడు వరదనీటితో పాటు పూడిక బయటకు పోయేందుకు సిల్ట్ గేట్లను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నిర్మించిన కొత్తలో వరదలు తక్కువగా రావడంతో గేట్ల వినియోగం జరగలేదు. క్రమంగా ఆ గేట్లు తెరుచుకోలేని స్థితిలోకి వచ్చాయి. 1994లో అప్పటి ఇంజినీరింగ్ అధికారులు సర్వే నిర్వహించి ప్రాజెక్టులో 21.687 టీఎఁసీల పూడి క చేరిందని గుర్తించారు.
నిల్వసామర్థ్యం 91.319 టీఎంసీలకు పడిపోయిందని గుర్తించారు. కానీ పూడిక తీయించే పనికి మాత్ర మ పూనుకోలేదు. 2022లో చెన్నైకి చెందిన ‘సికామ్’ సంస్థతో నీటిపారుదల శాఖ అధికారులు మరోసారి సర్వే చేయించారు. నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు పడిపోయిందని నిర్ధారించారు. గతంలో ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ 6.30 టీఎంసీలు ఉండగా, తాజాగా డెడ్ స్టోరేజీ 5 టీఎంసీలుగా లెక్కిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రా జెక్టు నీటి నిల్వసామర్థ్యం మరింతగా పడిపో యే అవకాశం ఉంది. రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకుని ప్రాజెక్ట్ పరిధిలో పూడిక తీయించాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు.






