నిరంతరాయంగా మెట్రో సేవలు
రైటప్: ఎల్‌అండ్‌టీ, మెట్రో అధికారులతో సమీక్షిస్తున్న ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి
భారీ వర్షాలు, ఈదురుగాలులకు అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు
వర్షాకాల ప్రణాళికపై సమీక్షించిన హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి
హైదరాబాద్: వర్షాకాలంలో నిరంతరాయంగా మెట్రో సేవలు అందించాలని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. గురువారం రసూల్‌పురలోని మెట్రో రైలు భవన్‌లో ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ కేవీడీరెడ్డి, ఆపరేషన్స్, మెయింటనెన్స్ కంపెనీ కియోలిస్ ఎండీ ఎస్‌సి మిశ్రా, హైదరాబాద్ మెట్రో రైల్ , సీనియర్ ఇంజనీర్లు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో అనుసరించాల్సిన పద్దతులపై వారితో చర్చించారు. ఇప్పటికే అనుసరిస్తున్న భద్రతా చర్యలను అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , ప్రయాణికుల భద్రత అత్యంత ముఖ్యమని అన్నారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల మెట్రోసేవలకు అంతరాయం కలగకుండా, ట్రాన్స్‌కో ఫీడర్ ట్రిప్ అయినట్లుతై తక్షణమే ప్రత్యామ్నాయ ఎలక్ట్రిక్ ఫీడర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.మెట్రో వయాడక్ట్ పక్కన మొలిచే చెట్లను ఎప్పటికప్పుడు తొలగించి శుభ్రం చేయాలన్నారు. వర్షం కారణంగా ప్లాట్‌ఫామ్‌లపై నీరు నిలిచిపోకుండా అదనపు హౌస్‌కీపింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పారు. రైలు ట్రాక్‌లు తుప్పు పట్టకుండా చర్యలు చేపట్టాన్నారు. వర్షాలు, భారీ ఈదురు గాలులకు మెట్రోస్టేషన్ల పైకప్పుటు ఎగిరిపోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
స్టేషన్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు ముంపుకు గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో సీనియర్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణిస్తుండగా ఓ మహిళ మృతిచెందిన విషయాన్ని ప్రస్తావిస్తూ, మెట్రోలో ప్రయాణం సందర్భంగా ప్రయాణికులకు భద్రతపై అవగాహన కలిగించాలని సూచించారు. ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్, ఆపరేషన్స్, మెయింటనెన్స్ , హైదరాబాద్ మెట్రో రైల్ , సీనియర్ ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.






