22 August, 2026 | 12:56 PM

యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షపై కలెక్టర్ అనుదీప్ సమీక్ష

13-06-2024 09:20 PM

హైదరాబాద్: ఈ నెల 16న ఆదివారం జరుగబోయే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  హైదరాబాద్‌లోని 99 కేంద్రాల్లో 45,153 మంది అభ్యర్థులు సివిల్స్ పరీక్ష హాజరవుతారని, ఆదివారం ఉదయం 9:30 నుంచి 11:30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు పేపర్  2 పరీక్ష ఉంటుందని చెప్పారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద జామర్లను ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులకు గాని  అనుమతి ఇవ్వకుడాదని సూచించారు. 

గుర్తింపు కార్డు లేని వారిని అనుమతించకూడదన్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, కనీస సౌకర్యాలు ఉండేలా చూడాలని చెప్పారు. యూపీఎస్సీ మార్గదర్శకాలకనుగుణంగా పరీక్షను నిర్వహించాలని ఆదేశించారు. యూపీఎస్సీ పరీక్ష నిర్వహణపై జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, యూపీఎసీస డిప్యూటీ సెక్రటరీ శైలేష్‌గౌతమ్, అశోక్‌జోషఙ, ఆర్డీవోలు మహిపాల్, దశరథ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు