పంజాగుట్టలో వ్యభిచారం.. నిర్వాహకురాలితో సహా ఐదుగురు అరెస్ట్
13-06-2024 08:06 PM
హైదరాబాద్ : హైదరాబాద్ నడిబొడ్డున ఓ ఫేమస్ హోటల్లో కొంతకాలంగా నడుస్తున్న వ్యభిచార దందాను పోలీసులు గుట్టురట్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాగుట్టలోని ప్రముఖ హోటల్ లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు సమాచారం రావడంతో హోటల్ పై దాడి చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు. నిర్వాహకురాలు సూర్యకుమారి సహా ఐదుగురిని అరెస్ట్ చేసి, నిందితుల నుంచి రూ.89 వేలు, 18 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.






