22 August, 2026 | 2:07 PM

ఆలయ అభివృద్ధికి ఎంపీ అరవింద్ నిధులు

22-08-2026 01:26 PM

మెట్ పల్లి, అగస్ట్22 (విజయక్రాంతి): పట్టణంలోని బోయవాడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి ఎంపీ ధర్మపురి అరవింద్ నిధుల నుంచి రెండు లక్షలు మంజూరయ్యాయి. ఈ మేరకు శనివారం ప్రొసీడింగ్‌ పత్రాన్ని ఆలయ పాలకవర్గ సభ్యులకు  బిజెపి జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అనూప్‌రావు, బిజెపి పట్టణ అధ్యక్షుడు ధోనికెల నవీన్‌ లు అందజేశారు. ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించిన ఎంపీ ధర్మపురి అరవింద్‌కు ఈ సందర్బంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి జుంగుల అనిల్ గౌడ్, బత్తుల జగదీశ్వర్, కలికోట శ్రీకాంత్, మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బొడ్ల ఆనంద్, పట్టణ ఉపాధ్యక్షుడు లోలపు అనిల్, భోగ దత్తు, కౌన్సిలర్లు  ధర్మపురి వేణుగోపాల్, కోయల్ కార్ లింగేశ్వర్, ఐటీ సెల్ కన్వీనర్ పాసికంటి శ్రీనివాస్, రాంపల్లి రఘుపతి తదితరులు పాల్గొన్నారు.