26 June, 2026 | 1:18 AM

నాకౌట్‌లో అడుగుపెట్టిన బ్రెజిల్

26-06-2026 12:12 AM

మియామీ, జూన్ 25 : ఫిఫా ప్రపంచకప్‌లో బ్రెజిల్ జైత్రయాత్ర కొనసాగుతోంది. టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటైన ఆ జట్టు 3 తేడాతో స్కాట్లాండ్‌ను చిత్తు చేసింది. స్టార్ స్ట్రుకర్ వినీషియస్ జూనియర్ రెండు గోల్స్ తో అదరగొట్టాడు. మ్యాచ్ ఆరంభమైన 7వ నిమిషంలోనూ అతను తొలి గోల్ కొట్టి ఆధిక్యాన్ని అందించాడు. ఫస్టాఫ్ చివర్లో వినీషి యస్ హెడర్ ద్వారా మరో గోల్ సాధించడంతో బ్రెజిల్ 2 ఆధిక్యంలోకి దూసుకె ళ్లింది. గ్రూప్ స్టేజ్ మూడు మ్యాచ్‌లలోనూ గోల్స్ చేసిన ఐదో బ్రెజిల్ ప్లేయర్‌గా వినీషియస్ రికార్డులకెక్కాడు. 60వ నిమిషంలో మాథ్యూస్ కొట్టిన గోల్‌తో బ్రెజిల్ విజయం ఖాయమైంది. కాగా 76వ నిమిషంలో నెయ్‌మార్ సబ్‌స్టిట్యూట్‌గా అడుగుపెట్టాడు.