calender_icon.png 21 January, 2026 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజిలెన్స్ కమిషనర్‌గా ఎంజీ గోపాల్

18-09-2024 12:00:00 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ విజిలెన్స్ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమిం చింది. మూడేళ్లపాటు ఈయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. 1983 ఐఏఎస్ బ్యాచ్ తెలంగాణ విభాగానికి చెందిన ఆయన గతంలో రాష్ట్రంలో పలు హోదాల్లో సేవలందించారు. 2017 ఫిబ్రవరిలో ఆయన రిటైరయ్యారు.