18-09-2024 12:00:00 AM
అభివృద్ధి నిరోధకులపై ఉక్కు పాదం మోపుతాం
ఎక్స్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ హెచ్చరిక
హైదరాబాద్, సెప్టెంబర్ 17 ( విజయక్రాంతి): ‘మిస్టర్ మాజీ మినిస్టర్ కేటీఆర్.. ఇంకెన్ని రోజులు డ్రామాలు ’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్స్ వేదికగా విమర్శించారు. ‘ ప్రజలకు పాలన అందించే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటును ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు.
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండకూడదని భావిస్తున్నారా? తెలంగాణ తల్లి విగ్రహాన్ని పరిపాలన కార్యాలయం లోపల ప్రతిష్ఠిస్తే మీ దొరలకు చూడటం ఇష్టం లేదా? విద్వేషాలను రెచ్చగొట్టే చిల్లర రాజకీయాలు మానుకోమని హితవు పలికారు. అధికారం పోయిన తర్వాత మీకు తెలంగాణ తల్లి గర్తుకు వచ్చిందా? 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్నది మీరే కదా? అప్పుడు తెలంగాణ తల్లి ఎందుకు గుర్తుకు రాలేదు అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలు ఓడించి ఇంటికి పంపి నా మీలో మార్పు రాలేదని మండిపడ్డారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని హుందాగా వ్యవహరించమని సూ చించారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పడం వెనక మీ కుటిల పన్నాగాలు ప్రజలకు అర్థం అవుతున్నాయని అన్నారు. మీ రాజకీయ ఉనికి కోసం మళ్లీ తెలంగాణ, ఆంధ్ర పేరుతో ప్రజలను, యువతను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, మీ కుట్రలను అడ్డుకుంటామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని చస్తున్న బీఆర్‌ఎస్, బీజేపీ డ్రామాలను నిలువరిస్తామని, తెలంగాణ అభివృద్ధి నిరోధకులపై ఉక్కు పాదం మోపుతాం.. ఖబడ్దార్ అని హెచ్చరించారు.