విద్యుద్ఘాతంతో పాడిగేదె మృతి
23-06-2026 08:59 PM
కారేపల్లి,(విజయక్రాంతి): విద్యుద్ఘాతంతో పాడి గేదె మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం గేటుకారేపల్లి సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. మేకలతండా గ్రామానికి చెందిన గుగులోత్ రవీందర్ కు చెందిన పాడి గేదె సోమవారం మేతకు గేటుకారేపల్లి హైస్కూల్ సమీపంలోని పోలాల వద్దకు వచ్చింది. ఆ ప్రాంతంలో బావులకు విద్యుత్ సరఫరా చేసే కరెంటు తీగలు క్రిందకు వేలాడుతున్నాయి. అక్కడికి మేతకు వచ్చిన గేదెకు తీగలు తగలి విద్యుద్ఘాతానికి గురై అక్కడి కక్కడే మృతి చెందింది. ఈ విషయమై విద్యుత్ అధికారులకు పిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. తమకు జీవనాధారమైన పాడి గేదె మృతి చెందిందని తమను ఆదుకోవాలని బాధితుడు అధికారులను వేడుకుంటున్నాడు.






