16 March, 2026 | 8:48 PM

Breaking News

కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •   ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పన   •   ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పక్కాగా అమలు చేయాలి   •  

ప్రతి ఒక్కరికీ యుద్ధ విద్య ఎంతో అవసరం..!

25-05-2025 10:52 PM

మాంక్స్ కరాటే అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు నాగరాజు..

కల్వకుర్తి: పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలనుకోవడం ఉత్తముని లక్షణమని, యుద్ధ విద్య కరాటే ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమని మాంక్స్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అసోసియేషన్(Manx Martial Arts Karate Association) గౌరవ అధ్యక్షుడు నాగరాజు, కరాటే మాస్టర్ నీరటి కుమార్ లు అన్నారు. ఆదివారం వెల్దండ మండలం, కొట్ర గ్రామంలో కరాటే మాస్టర్ నీరటి కుమార్ పర్యవేక్షణలో శిక్షణ పొందిన పవన్, అఖిరా, జత్విన్, వసంత్ కుమార్, రిత్విక్, ఆరాధ్య లకు ఆరంజ్ బెల్టులు అందజేయగా నవ్య, యశశ్విత, ప్రణయ్, శశాంక్, నితీష్, విద్యాదిత్య, మహతిలకు గ్రీన్ బెల్టులు ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడు నాగరాజుతో పాటు సీఆర్పీ ఆంజనేయులు, అశోక్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు బెల్టులు అందజేశారు. మాస్టర్ కుమార్ తన సొంత ఖర్చులతో పురిటి గడ్డ ఋణం తీర్చుకునే దిశగా ఉచితంగా కరాటే నేర్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాగేష్, విద్యార్థులు ఉన్నారు.