calender_icon.png 20 December, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్పీ చిత్రపటానికి క్షీరాభిషేకం

19-12-2025 12:00:00 AM

  1. ఇల్లు నిలబెట్టారంటూ బాధితురాలు కృతజ్ఞతలు
  2. కురవి మండలం స్టేషన్ గుండ్రాతిమడుగులో ఘటన

మహబూబాబాద్,డిసెంబర్ 18 (విజయక్రాంతి): జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ చిత్రపటానికి ఓ బాధితురాలు క్షీరాభిషేకం చేసిన ఘటన గురువారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం స్టేషన్ గుండ్రాతిమడుగు గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు తన పాత ఇల్లు పాడైపోగా కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి పం చాయతీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని పేర్కొన్నారు.

అయితే ఇంటి నిర్మాణ సమయంలో కొందరు అడ్డు తగిలి, ఇంటి నిర్మాణం చేయకుండా తమపై బెదిరింపులకు దిగడం దాడికి పాల్పడ్డారన్నారు. ఈ ఘటనపై తమ వద్ద ఉన్న అనుమతి ప త్రాలను తీసుకువెళ్లి పోలీసులను ఆశ్రయించామని బాధితురాలు పేర్కొన్నారు. వెంటనే స్పందించిన పోలీసులు తమపై అకారణంగా దాడికి పాల్పడ్డ వా రిపై చర్యలు తీసుకొని తమ ఇంటి నిర్మాణానికి ఇ బ్బందులు లేకుండా చేశారని కృతజ్ఞతగా ఎస్పీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసినట్లు బాధితురాలు సులో చన పేర్కొన్నారు.