19-12-2025 12:00:00 AM
కొండాపూర్, డిసెంబర్ 18 : కొండాపూర్ లో బిఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలింది. వారం రోజుల క్రితం తొలివిడత పంచాయితీ ఎన్నికల్లో తోగర్పల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసిన అంతమ్మ కుమారుడు బాల్ రాజు టిజిఐఐసి చైర్మెన్ నిర్మలజగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం కొండాపూర్ మండల పరిధిలోని తొగర్పల్లిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ దివ్యవాణి కృతజ్ఞత సభలో తొగర్పల్లి సర్పంచ్ అభ్యర్థిగా బిఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన బరిలో దిగిన అంతమ్మ కుమారుడు బాల్ రాజు కు టిజిఐఐసి చైర్మెన్ నిర్మలజగ్గారెడ్డి కాంగ్రెస్ కండువా వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మెన్ వై.ప్రభు, మాజీ ఎంపిపి మనోజ్ రెడ్డి, నాయకులు ప్రభాకర్, జలంధర్, గోపాల్ రెడ్డి, ప్రభాకర్, విఠల్ రెడ్డి తదితరులున్నారు.