calender_icon.png 20 December, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

అక్రమ కేసుల కొట్టివేత బీజేపీకి చెంపపెట్టు

19-12-2025 12:00:00 AM

టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంత కిషన్

సంగారెడ్డి, డిసెంబర్ 18 : కుట్రలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, యువనేత రాహుల్ గాంధీలపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయడం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కేసులు కొట్టివేత బీజేపీకి చెంప పెట్టులాంటిదని టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ అన్నారు. గాంధీల కుటుంబాల చరిత్రను చెరిపేయడానికి బీజేపీ కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు.

కాంగ్రెస్ పై బీజేపీ కుట్ర రాజకీయాలను నిరసిస్తూ సంగారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ కొత్త బస్ స్టాండ్ వద్ద రాస్తా రోకో చేపట్టారు. బీజేపీ కుట్ర రాజకీయాలను ఎక్కడికక్కడ ఎండగడతామని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వంలోని ప్రధానిమోదీ, అమిత్ షాలు కక్ష్య పూరితంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ, సీబీఐలతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు వాడుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ఆంజనేయులు, సీడీసీ చైర్మెన్ రామ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, కిరణ్ గౌడ్, షఫీ, నాగరాజ్, వెంకట్ రాజ్, ఆరిఫ్, బాబు, అరుణ్, మహేష్ లాల్, అర్జున్, నరేన్, కసిని రాజు తదితరులు పాల్గొన్నారు.