24 August, 2026 | 11:36 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

బోధన్ కో–ఆప్షన్ ఎన్నికలను బహిష్కరించిన ఎంఐఎం, బీజేపీ పార్టీలు

30-06-2026 03:08 PM

- బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు.

బోధన్,(విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఎన్నికలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికను బహిష్కరిస్తూ బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు నిర్ణయం తీసుకున్నారు. సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో బోధన్ నియోజకవర్గం కో–ఆప్షన్ ఎన్నికను మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి  ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరు కాగా ఎన్నిక కార్యక్రమం జరిగింది.

అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ కౌన్సిలర్లు హాజరుకావాల్సి ఉండగా.. వారు ఎన్నికలను బహిష్కరించారు. మూడు నెలలుగా కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండా ఒకేసారి కోఆప్షన్ ఎన్నిక, కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడంపై గుర్రుగా ఉన్న ఎంఐఎం వైస్ఛైర్మన్ మీర్ ఇలియాజ్ అలీ ఆధ్వర్యంలో.. ఎలక్షన్ను బాయ్కాట్ చేశారు. అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంల అనైతిక పొత్తును నిరసిస్తూ బీజేపీ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు.

కో ఆప్షన్ అనంతరం జనరల్ బాడీ మీటింగ్..

మూడు నెలల అనంతరం మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ఉన్న సమస్యలపై వాడీవేడిగా చర్చ జరగనుంది. ఈ సమావేశానికి అన్ని పార్టీల కౌన్సిలర్లు హాజరయ్యారు. అయితే ఎజెండా అంశాలను చర్చించకుండానే కేవలం నిమిషాల వ్యవధిలోనే జనరల్ బాడీ మీటింగ్ను ముగించడంపై సైతం బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు నిరసన తెలిపారు. సమావేశం హాల్ నుంచి బయటకు వచ్చి నినాదాలు చేశారు. పూర్తిగా ఏకపక్షంగా జనలల్ బాడీ సమావేశం నిర్వహించారని.. ఎలాంటి సమస్యలను చర్చించకుండానే ముగించారని వారు నినదించారు.