28 August, 2026 | 10:43 PM

Breaking News

సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆధునిక సాంకేతికతలపై అవగాహన   •   స్థాయి మరచి వ్యక్తిగత, అసత్య ఆరోపణలు చేస్తే సహించము   •   ప్రభుత్వ ఐటిఐ (బాలికలు) 3వ విడత వాక్ఇన్ అడ్మిషన్లు   •   సోదరుల క్షేమాన్ని కోరుతూ.. రాఖీలు కట్టిన సోదరీమణులు...   •   ఘనంగా 44వ కొండగట్టు గిరి ప్రదక్షిణ   •   అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఆత్మీయ ప్రతీక.. రాఖీ పౌర్ణమి   •   బాన్సువాడ ఎంఈఓ నాగేశ్వరరావు తండ్రి రామయ్య కన్నుమూత   •   నాచారం పోలీస్ స్టేషన్‌లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహణ   •   బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే మల్లారెడ్డి   •   సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన ఆత్రం సుగుణక్క   •  

ఖాళీ కుర్చీలకే సమస్యలు చెప్పుకున్న ఎంఐఎం కౌన్సిలర్లు

23-06-2026 12:00 AM

బోధన్, జూన్ 22 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎంఐఎం పార్టీ నాయకులు, కౌన్సిలర్లు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తమ వార్డుల్లోని సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే మున్సిపల్ కార్యాలయం ఎదుటే టెంట్ వేసి, సొంతంగా కౌన్సిల్ మీటింగ్ను ఏర్పాటు చేసి ఆందోళనకు దిగారు. ఎదురుగా ఖాళీ కుర్చీలు పెట్టి వాటిలో చైర్మన్, కమిషనర్ కూర్చున్నట్లుగా భావిస్తూ తమ వార్డుల సమస్యలను వారికి చెప్పుకుంటూ నిరసన తెలిపారు.

తమ వార్డు ప్రజల గోస అధికారులకు వినపడటం లేదా అని, సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియకనే ఈ రకంగా ఆందోళన చేయాల్సి వచ్చిందని బోధన్ మున్సిపల్  పోలీర్ ఎంఐఎం ప్రెసిడెంట్ ఇలియాస్, కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కమిషనర్, చైర్మన్ స్పందించి తక్షణమే అధికారికంగా కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసి, తమ వార్డు సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పాల్గొన్నారు.